- Home
- bollywood
బాలీవుడ్ బాక్సాఫీసును కొల్లగొడుతున్న KGF-2
పాన్ ఇండియా మూవీ 'కేజీఎఫ్ 2' సినీ పరిశ్రమ రికార్డులను బద్దలు కొడుతోంది. బాలీవుడ్ లో సైతం బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. హిందీలో ఈ చిత్రం సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. కేవలం ఐదు రోజుల్లోనే హిందీలో రూ. 200 కోట్లు కొల్లగొట్టింది. రూ. 200 కోట్లను వసూలు చేయడానికి 'బాహుబలి 2'కి ఆరు రోజులు పట్టింది. ఈ నేపథ్యంలో, అతి తక్కువ రోజుల్లో హిందీలో రూ. 200 కోట్లు వసూలు చేసిన చిత్రంగా 'కేజీఎఫ్ 2' రికార్డు పుటల్లోకి ఎక్కింది.