- Home
- health
నిమ్మరసంతో ఇలా చేస్తే..
సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మండే ఎండాకాలం మొదలైంది. ఈ కాలంలో డీహైడ్రేషన్, కళ్లు తిరగడం లాంటి ఆరోగ్య సమస్యలే కాదు సన్ ట్యాన్, మొటిమలు, జిడ్డు చర్మం లాంటి చాలా సమస్యలు ఎదురవుతాయి. వీటి నుంచి విముక్తి పొందడానికి చాలా రకాల ప్రయత్నాలే చేస్తుంటారు మగువులు.. కొంతమంది సూర్యుడికి మొఖం చూపించడమే మానేస్తారు, కొంతమంది సన్ స్క్రీన్ లోషన్లు రాసి, స్కార్ఫులు కట్టుకుని ధైర్యంగా బయటకెళ్తారు.
ఎండతాకిడికి లోనైన చర్మం బాగా ఎర్రబడి, మండుతుంటుంది. ఆ తర్వాత కమిలి నలుపురంగుకు మారుతుంటుంది. ఈ సమస్యనే ట్యాన్ అంటారు. ఈ ట్యాన్‌ను పోగొట్టుకోవడానికి పార్లర్లకు వెళ్లి డబ్బులు వదిలించుకుంటారు. అలాకాకుండా ఇంట్లో ఉండే వస్తువులతోనే, రూపాయి ఖర్చు లేకుండా సులభంగా ట్యాన్ పోగొట్టుకోవచ్చు తెలుసా..
నిమ్మరసం, రోజ్ వాటర్, దోసకాయ రసం కలిపి ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. నిమ్మరసం సిట్రిక్ యాసిడ్, ఇది టాన్‌ను తొలగించడంలో సహాయపడుతుంది. దోసకాయ, రోజ్ వాటర్ కూలింగ్ ఏజెంట్లు.
కొంచెం తేనె, నిమ్మరసం కలిపి ట్యాన్ పట్టిన ప్రాంతంలో రాయాలి. ఇది యాంటీ ట్యాన్ ప్యాక్ మిశ్రమాలలో ఒకటి.
కొన్ని పచ్చి పాలు, పసుపు, కొంత నిమ్మరసం వేసి పేస్ట్‌ను సిద్ధం చేసుకోండి. ఈ పేస్ట్ చర్మంపై అప్లై చేసి, ఆరిపోయే వరకు ఉంచాలి. ఆ తర్వాత కాస్త చల్లటి నీళ్లతో కడిగేయాలి. ఇది ట్యాన్ ను తొలగిస్తుంది.
శెనగపిండి, నిమ్మరసం, కొంత పెరుగు కలిపి ట్యాన్ ఎఫెక్టెడ్ ప్రాంతంలో రాయాలి. ఇలా రోజూ చేస్తే.. మీ ట్యాన్ తొలగి చర్మం గ్లో అవుతుంది.
తాజా నిమ్మరసాన్ని మోచేతులు, మోకాళ్లు ఇలా నల్లగా ఉన్న ప్రాంతాల్లో రాయాలి. కనీసం 15 నిమిషాలు అలానే ఉంచి ఆతర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే ఆ ప్రాంతాల్లో ట్యాన్ తొలగి చర్మం తెల్లాగా మారుతుంది.
పాలపొడి, నిమ్మరసం, తేనె, బాదం నూనె సమాన భాగాలతో కలిపి ఒక క్రీమ్ తయారు చేసుకోంది.
ఇది ట్యాన్ ఉన్న ప్రాంతాల్లో రాసి 20 నిమిషాలు అలాగే ఉంచండి.
ఇది ఒక వారం నిల్వ ఉంచుకోవచ్చు. ట్యాన్ తొలగించడానికి సమర్థవంతంగా పనిచేస్తుంది.
పసుపు, నిమ్మరసం కలిపిన పేస్ట్‌ను వారానికి మూడుసార్లు చర్మానికి అప్లై చేయండి. ఇది చర్మం రంగును మెరుగుపరుస్తుంది. టాన్‌ను తొలగిస్తుంది.