- Home
- technology
ట్విట్టర్ లో కొత్త అప్‌డేట్స్.
“ట్వీట్‌ను ఎడిట్ చేయడానికి ట్విట్టర్ పెద్దగా ఎలాంటి మార్పు లేని ఓ అప్రోచ్ ఫాలో అవుతోంది. దీని ప్రకారం, ఎడిట్ ఫీచర్ అనేది ట్వీట్‌లోని ట్వీట్ టెక్స్ట్‌ను మార్చదు. మొదటగా ఎడిట్ చేసిన ట్వీట్ అలాగే ఉంటుంది. ఏదైనా ట్వీట్‌ను ఎడిట్ చేస్తే ఆ ట్వీట్ ఎడిటెడ్ టెక్స్ట్‌తో అప్‌డేట్ అవ్వదు. అందుకు బదులుగా ఎడిటెడ్ టెక్స్ట్‌తో ఆ ఓల్డ్ ట్వీట్ మళ్లీ కొత్త ట్వీట్‌గా కొత్త ఐడీతో క్రియేట్ అవుతుంది. ఇది ముందుగా చేసిన ఓల్డ్ ట్వీట్‌ల లిస్టుతో యాడ్ అవుతుంది” అని మాన్‌చున్ వాంగ్ ఒక ట్వీట్‌లో వెల్లడించారు. సింపుల్‌గా చెప్పాలంటే ఒకరు ట్వీట్‌ను ఎడిట్ చేసినప్పుడు, ట్విట్టర్ దాని ప్రీవియస్ వెర్షన్లను చూపిస్తూనే పూర్తిగా కొత్త ట్వీట్‌ను క్రియేట్ చేస్తుంది.
యాప్ రీసెర్చర్ అలెశాండ్రో పలుజ్జీ షేర్ చేసిన స్క్రీన్‌షాట్ ప్రకారం, ట్వీట్ రైట్ కార్నర్ టాప్‌లో త్రీ-డాట్ మెనూలో ఎడిట్ ట్వీట్ ఫీచర్ కనిపిస్తుంది. ఎడిట్ ట్వీట్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకొని ట్వీట్‌లోని టెక్స్ట్ ఎడిట్ చేయొచ్చు.