- Home
- tollywood
'రాధే శ్యామ్' సినిమా రిజల్ట్ పై తొలిసారి స్పందించిన ప్రభాస్!
'రాధే శ్యామ్' భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ, ప్రేక్షకులను మాత్రం పెద్దగా అలరించలేకపోయింది. తన సినిమా వైఫల్యంపై ప్రభాస్ ఏ విధంగా స్పందిస్తాడనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఇన్ని రోజులు మౌనంగా ఉన్న ప్రభాస్... సినిమా రిజల్ట్ పై ఇప్పుడు తొలిసారి స్పందించాడు.
టెలివిజన్ స్క్రీన్ పై 'రాధే శ్యామ్' ను ఇష్టపడతారని భావిస్తున్నట్టు ప్రభాస్ చెప్పాడు. కుటుంబం మొత్తం టీవీ ముందు కూర్చొని సినిమాను ఎంజాయ్ చేస్తారని తెలిపాడు. సినిమా భారీ కలెక్షన్లను సాధించలేక పోవడానికి కారణం కరోనా కావొచ్చు.. లేదా స్క్రిప్ట్ లో ఏదైనా మిస్ అయి ఉండొచ్చని అభిప్రాయపడ్డాడు. లేదా అలాంటి జోనర్ లో తనను చూడాలని ప్రేక్షకులు అనుకోవడం లేదేమో అని కూడా అన్నాడు. లేదా తాను ఇంకా బాగుండాలని అనుకొని ఉండొచ్చని చెప్పాడు.