నాని 26వ సినిమా 'టక్ జగదీష్' లో స్వల్ప మార్పులు

Admin 2020-09-14 13:04:11 entertainmen
నాని 25వ సినిమా 'వి' నిరాశ పర్చడంతో నాని ఆలోచనలో పడ్డట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం నాని 26వ సినిమా 'టక్ జగదీష్' సినిమాకు సంబంధించిన స్ర్కిప్ట్ విషయంలో స్వల్పంగా మార్పులు చేర్పులు చేయించాడట. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం త్వరలో పునః ప్రారంభం కాబోతున్న టక్ జగదీష్ కు సంబంధించిన కొన్ని సీన్స్ లో కామెడీని జోడించాలని నాని కోరుతున్నాడట. నిన్ను కోరి సినిమాలో తరహా ఎంటర్ టైన్ మెంట్ ను నాని మరోసారి టక్ జగదీష్ చూపించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. భారీ అంచనాలున్న టక్ జగదీష్ సినిమా రూపొందుతుంది.