అందాన్ని రెట్టింపు చేసే జామ ఆకులు..!

Admin 2020-09-14 13:16:11 entertainmen
అమ్మాయి, అబ్బాయిలు కూడా అందంగా క‌నిపించాల‌ని ఆర‌ట‌ప‌డుతుంటారు. బ్యూటీపార్లర్ల చుట్టూ తిరిగి ఎంతో ఖర్చు పెడుతుంటారు. మార్కెట్ లో దొరికే అనేక రకాల క్రీములు కొనుగోలు చేసి వినియోగిస్తారు.అయితే వాస్త‌వానికి మార్కెట్ లో దొరికే ప్రతీ ఉత్పత్తిలో రసాయనిక పదార్థాలు ఉంటాయి. ఇవి చ‌ర్మాన్ని అందంగా.అంద‌హీనంగా చేస్తాయి.అందుకే సహజసిద్ద పద్ధతులతోనే చ‌ర్మ సౌంద‌ర్యాన్ని మెరుప‌రుచుకోవాలి.అయితే అందాన్ని రెట్టింపు చేసేవాటిలో జామ ఆకులు కూడా ఒక‌టి.

జామ ఆకుల్లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్క‌లంగా ఉంటాయి.ఇవి ఆరోగ్యానికి ఉప‌యోగ‌ప‌డ‌ట‌మే కాదు.అందాన్ని కూడా రెట్టింపు చేస్తాయి.మ‌రి జామ ఆకుల‌ను చ‌ర్మానికి ఎలా ఉప‌యోగించాలి అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.
జామ ఆకులను తీసుకుని నీటితో కలిపి మరిగించాలి.ఈ నీటిని ముఖంపై అప్లై చేసి.ఆరిన త‌ర్వాత క్లీన్ చేసుకోవాలి.ఇలా క్ర‌మం త‌ప్ప‌కుండా చేస్తూ ఉంటే.ముడుతలను, సన్నటి గీతలను త‌గ్గించి చ‌ర్మాన్ని య‌వ్వ‌నంగా మారుస్తుంది. ఇలా ప్ర‌తిరోజు చేయ‌డం వ‌ల్ల మొటిమ‌లు, న‌ల్ల మ‌చ్చ‌లు, డెడ్ సెల్ ను తొలిగిస్తుంది. జామాకుల‌ను పే స్ట్ చేసి.అందులో కొద్దిగా రోజ్ వాట‌ర్ మిక్స్ చేసి ముఖానికి ప‌ట్టించాలి. పావు గంట తర్వాత చ‌ల్ల‌టి నీటితో క్లీన్ చేసుకోవాలి.ఇలా చేయ‌డం వ‌ల్ల ముఖం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది.