ఎంతో సంతోషంగా ఉందన్న ముద్దుగుమ్మ : కాజల్ అగర్వాల్

Admin 2022-04-21 08:27:50 ENT
బిడ్డకు జన్మనిచ్చిన కాజల్ మాతృత్వపు ఆనందాన్ని పొందుతోంది. తన బిడ్డకు స్వాగతం పలుకుతూ సోషల్ మీడియాలో భావోద్వేగమైన పోస్ట్ పెట్టింది. తన బిడ్డ నీల్ ను ప్రపంచంలోకి ఆహ్వానించడం ఎంతో సంతోషంగా ఉందని కాజల్ తెలిపింది.

తొలిసారి నీల్ తన ఛాతీపై పడుకున్నప్పుడు ప్రేమకు సంబంధించి ఎంతో లోతైన భావనను పొందానని తెలిపింది. ఆ క్షణం తన జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేనిదని చెప్పింది. ఒక బిడ్డకు జన్మనివ్వడం అంత సులువైన విషయం కాదని... మూడు రోజులు తాను నిద్రలేని రాత్రులను గడిపానని తెలిపింది.

ఇప్పుడు బిడ్డ కళ్లలోకి ప్రేమగా చూడటం, హత్తుకోవడం చేస్తూ కొత్త జీవితాన్ని ఆవిష్కరించుకుంటున్నానని తెలిపింది. అద్భుతమైన ఈ ప్రయాణాన్ని ఆనందంగా సాగిస్తున్నామని చెప్పింది.