నేడు ముంబైతో తలపడనున్న చెన్నై

Admin 2022-04-21 08:37:51 ENT
ఐపీఎల్ 15వ సీజన్ లో భాగంగా గురువారం చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. డివై పాటిల్ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ సీజన్ లో ఇప్పటివరకు ముంబై ఒక్క మ్యాచ్ లో కూడా విజయం సాధించలేదు. చెన్నై ఒక్క మ్యాచ్ లో మాత్రమే విజయం సాధించింది. ఇరు జట్లకు ఈ మ్యాచ్ కీలకం కానుంది. ఈ మ్యాచ్ లో ఏ జట్టు గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు? కామెంట్ చేయండి.