తల్లికాబోతున్న..మరియా షరపోవా

Admin 2022-04-21 10:43:47 ENT
తన ఆటతోనే కాకుండా, అందంతో కూడా ప్రపంచ టెన్నిస్ ప్రియులను కట్టిపడేసిన టెన్నిస్ క్వీన్ మరియా షరపోవా తల్లి కాబోతోంది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా ప్రకటించింది. ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ విషయాన్ని అభిమానులతో పంచుకుంది. నిన్న తన 35వ పుట్టినరోజు సందర్భంగా ఆమె ఈ విషయాన్ని వెల్లడించింది. బేబీ బంప్ తో ఉన్న ఫొటోను షేర్ చేసి... 'విలువైన ప్రారంభం' అని క్యాప్షన్ పెట్టింది. 2020లో టెన్నిస్ కు షరపోవా గుడ్ బై చెప్పింది. తన కెరీర్ లో ఐదు సార్లు గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ గా నిలిచింది. ఇన్స్టాలో ఆమెకు 42 లక్షల మంది ఫాలోయర్లు ఉన్నారు. బ్రిటీష్ బిజెనెస్ మెన్ అలెగ్జాండర్ గిల్క్స్ తో ఎంగేజ్ మెంట్ చేసుకున్నట్టు గత డిసెంబర్ లో షరపోవా వెల్లడించింది.