జగన్ తెర జీవిత పాత్రను ప్రముఖ నటుడు నాగార్జున పోషించనున్నాడని సమాచారం

Admin 2020-09-14 16:16:11 entertainmen
వైఎస్ జగన్ సీఎం అయ్యేంతవరకూ జరిగిన సంఘటనలతో 'యాత్ర-2' స్క్రిప్ట్ ను ఆయన సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. ఇందులో జగన్ తెర జీవిత పాత్రను ప్రముఖ నటుడు నాగార్జున పోషించనున్నాడని సమాచారం. మహీ వీ రాఘవ చెప్పిన స్క్రిప్ట్ పై నమ్మకంతో నాగ్, ఈ పాత్రను చేసేందుకు ఒప్పుకున్నారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ విషయంలో అధికారిక స్పందన వెలువడాల్సి వుంది. ఈ వార్తే నిజమై, నాగార్జున, తెరపై జగన్ పాత్రను పోషిస్తే, సినిమాపై భారీ అంచనాలు ఏర్పడటం ఖాయం.