- Home
- tollywood
వరుస ప్రాజెక్టులతో కృతి శెట్టి
కృతి శెట్టి నుంచి మరో మూడు సినిమాలు రానున్నాయి. సుధీర్ బాబు సరసన చేసిన 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' .. నితిన్ జోడీగా చేసిన 'మాచర్ల నియోజకవర్గం' .. రామ్ సరసన కథానాయికగా చేసిన 'ది వారియర్' ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నాయి.
తాజా ఇంటర్వ్యూలో కృతి శెట్టి మాట్లాడుతూ .. " ఇంతవరకూ నేను చేసిన పాత్రలన్నీ ఒకదానితో ఒకటి సంబంధం లేనివే. అలా వైవిధ్యభరితమైన పాత్రలను చేయడం వల్లనే ఆడియన్స్ నన్ను ఆదరించారు. తెరపై 'రాకుమారి'గా కనిపించాలనేది నా డ్రీమ్ రోల్. అలాంటి అవకాశం కోసమే ఎదురుచూస్తున్నాను" అంటూ చెప్పుకొచ్చింది