అఖిల్ తల్లి పాత్రలో పాతికేళ్ల తర్వాత మళ్లీ ఆమని

Admin 2020-09-16 12:31:11 entertainmen
ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు అఖిల్ కి ఆమె అమ్మగా ఓ చిత్రంలో నటించనుంది. ప్రస్తుతం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' చిత్రంలో నటిస్తున్న అఖిల్ త్వరలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇటీవలే వచ్చింది. స్పై థ్రిల్లర్ కథాంశంతో రూపొందే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ క్రమంలో ఇందులో హీరో అఖిల్ తల్లి పాత్ర కూడా కీలకమైన పాత్ర అనీ, దీనికి టాలెంటెడ్ ఆర్టిస్టు అయిన ఆమనిని ఎంచుకున్నారని తాజా సమాచారం.