తాప్సీ ఆసక్తికర వ్యాఖ్యలు

Admin 2020-09-16 13:11:11 entertainmen
రియా చక్రవర్తి జుడీషియల్ రిమాండ్ లో ఉంది. ఈ నేపథ్యంలో, టాలీవుడ్ నటి తాప్సీ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఒక వ్యక్తి తరచూ వివాదాస్పదంగా మాట్లాడితే కొన్ని రోజుల తర్వాత వారి వ్యాఖ్యలు ఇతరులపై ఎలాంటి ప్రభావాన్ని చూపవని వ్యాఖ్యానించింది. ఇదే మాదిరి కంగనా రనౌత్ మాటలు కూడా తనపై ఎలాంటి ప్రభావాన్ని చూపించలేవని చెప్పింది. రియా చక్రవర్తి గురించి మాట్లాడుతూ... రియా ఎవరో తనకు తెలియదని తాప్సీ తెలిపింది. రియాతో తనకు ఎలాంటి పరిచయం లేదని చెప్పింది. అయితే సుశాంత్ ఆత్మహత్య కేసులో రియాను టార్గెట్ చేయడం, ఆమె పట్ల అన్యాయంగా వ్యవహరిస్తున్న తీరును చూస్తుంటే బాధగా ఉందని తెలిపింది.