- Home
- tollywood
రవితేజ సినిమాలోసీరత్ కపూర్ కు మళ్లీ హీరోయిన్ గా అవకాశం
ఆమధ్య 'టచ్ చేసి చూడు' సినిమాలో రవితేజకు జోడీగా నటించిన సీరత్ కపూర్ కి కూడా అలాగే మళ్లీ రవితేజ సరసన నటించే ఛాన్స్ వచ్చింది.
రవితేజ హీరోగా నటించే సినిమాలో సీరత్ కు మళ్లీ హీరోయిన్ గా అవకాశం రావడం లక్కీ అనే చెప్పాలి. రమేశ్ వర్మ దర్శకత్వంలో రవితేజ ఓ చిత్రాన్ని ఒప్పుకున్నాడు. దీనికి 'ఖిలాడి' అనే టైటిల్ని కూడా నిర్ణయించినట్టు వార్తలొచ్చాయి. ఇప్పుడీ చిత్రంలో సీరత్ కపూర్ ని ఓ కథానాయికగా ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తాను చేస్తున్న 'క్రాక్' సినిమా పూర్తయ్యాక ఈ కొత్త చిత్రాన్ని రవితేజ ప్రారంభిస్తాడు.