- Home
- bollywood
'సూపర్ మచ్చి' సినిమాలో సెకండ్ హీరోయిన్ పాత్రలో : రియా చక్రవర్తి
సుశాంత్ మృతికి పూర్తిగా రియా చక్రవర్తి కారణం అంటూ కొందరు ఆరోపిస్తున్నారు. ఆ తర్వాత డ్రగ్స్ కేసులో రియాకు సంబంధం ఉంది అన్నట్లుగా ఎన్ సీ బీ వారు అనుమానించారు. ఆ తర్వాత ఆమె డ్రగ్స్ కొనుగోలు చేసినట్లుగా సాక్ష్యాధారాలు కూడా లభించంతో ఆమెను అరెస్ట్ చేశారు. ఈ సమయంలోనే ఆమెకు సంబంధించిన కొన్ని విషయాలు మీడియాలో ప్రచారం జరుగుతోంది. కొన్నాళ్ల క్రితం ఒక తెలుగు నిర్మాతను ఆమె ఇబ్బంది పెట్టింది అనే పుకార్లు జోరుగా వినిపిస్తున్నాయి. కళ్యాణ్ దేవ్ హీరోగా నటిస్తున్న 'సూపర్ మచ్చి' సినిమాలో సెకండ్ హీరోయిన్ పాత్రకు ఎంపిక అయ్యిందట. కొన్ని రోజులు షూటింగ్ జరిగిన తర్వాత రియా సినిమా పూర్తి అవుతుందనే నమ్మకం లేదంటూ తప్పుకుందట. ఆ సమయంలో పెద్దల వద్దకు ఆ వివాదం వెళ్లిందట.