సెప్టెంబరు 22కి కూడా ప్రాముఖ్యం ఉందని మెగాస్టార్ చిరంజీవి

Admin 2020-09-22 17:43:11 entertainmen
సెప్టెంబరు 22కి కూడా అంతే ప్రాముఖ్యం ఉందని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. ఆగస్టు 22 తాను మనిషిగా ప్రాణం పోసుకున్న రోజని, సెప్టెంబరు 22 తాను నటుడిగా ప్రాణం పోసుకున్న రోజని చెప్పారు. ఈ రోజే తన తొలి చిత్రం ప్రాణం ఖరీదు విడుదలైందని వివరించారు. తనను ఇంతగా ఆదరించి ఈ స్థాయికి చేర్చిన సినీ ప్రేక్షకులకు, ముఖ్యంగా తన ప్రాణానికి ప్రాణమైన అభిమానులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నానని చిరంజీవి ట్విట్టర్‌లో పేర్కొన్నారు. కాగా, ప్రాణం ఖరీదు సినిమా 1978 సెప్టెంబరు 22న విడుదలైంది.