డ్రగ్స్‌ కేసులో బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణే పేరు

Admin 2020-09-22 17:54:11 entertainmen
డ్రగ్స్‌ కేసులో బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణే పేరు బయటకు రావడంతో ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేసిన సినీనటి కంగనా రనౌత్ విమర్శలు గుప్పించింది. 'డ్రగ్స్ వాడకం ఫలితమే డిప్రెషన్. క్లాస్‌గా కనబడుతున్న కొందరు స్టార్ల పిల్లలు వాళ్ల మేనేజర్లను మాల్ గురించి అడుగుతుంటారు' బాలీవుడ్‌లో డ్రగ్స్ వాడే వాళ్లతో పాటు దీపికా పదుకొణేను బాయ్‌కాట్ చేయాలంటూ ఆమె హ్యాష్‌ట్యాగ్‌ జోడించింది. కాగా, గతంలో దీపిక డిప్రెషన్‌లోకి వెళ్లి కోలుకుంది. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ కంగనా ఈ ట్వీట్ చేసింది. సుశాంత్‌ ప్రియురాలు రియా చక్రవర్తితో పాటు డ్రగ్స్‌ డీలర్లను అధికారులు విచారించగా బాలీవుడ్‌లో ప్రముఖుల పేర్లు బయటపడుతున్నాయి.