అమెరికాలో తొలి షెడ్యూలుకు ఏర్పాట్లు

Admin 2020-09-22 18:04:11 entertainmen
మహేశ్ బాబు నటించే తాజా చిత్రం 'సర్కారు వారి పాట'. పరశురాం దర్శకత్వంలో ఈ చిత్రం బ్యాంక్ స్కాముల నేపథ్యంలో రూపొందనుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. కథ ప్రకారం అమెరికాలో కొంత భాగం షూటింగ్ చేయాల్సి ఉండడంతో తొలి షెడ్యూలును అక్కడ నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. అమెరికా షెడ్యూలుకు సంబంధించిన తాజా సమాచారం వెల్లడైంది. యూనిట్ సభ్యులకు 'ఓ' కేటగిరీ వీసాకు సంబంధించిన పేపర్ వర్క్ అంతా పూర్తయిందని ఈ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న గోపీకృష్ణ నర్రావుల తెలిపారు.