- Home
- international
మేమే అమెరికాలో అధికారంలోకి వస్తాం!
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ తానే గెలుస్తానని, మరో నాలుగేళ్లు తమ దేశానికి అధ్యక్షుడిని తానేనని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు.
ఎన్నికలు తమ దేశ చరిత్రలోనే అత్యంత కీలకమైనవని వ్యాఖ్యానించారు. అమెరికా ప్రజలకు అధికారాలిచ్చే దిశగా తాము పని చేస్తున్నామని అన్నారు. దేశ ప్రజల మద్దతుతో ఇప్పటి వరకు పాలన సజావుగా సాగిందని తెలిపారు. తమ పార్టీకి మరోసారి అధికారమివ్వాలని, అమెరికాకు మరింత సేవ చేసుకునే అవకాశం కల్పించాలని అన్నారు.