- Home
- sports
శిఖర్ ధవన్ అజేయ సెంచరీ..
శిఖర్ ధవన్ అజేయ సెంచరీకి తోడు, అక్షర్ పటేల్ ధనాధన్ ఇన్నింగ్స్ తోడవడంతో 180 పరుగుల విజయ లక్ష్యాన్ని ఢిల్లీ ఐదు వికెట్లు మాత్రమే కోల్పోయి మరో బంతి మిగిలి ఉండగానే అందుకుంది. ఈ విజయంతో ఢిల్లీ 14 పాయింట్లతో ప్లే ఆఫ్‌కు చేరువ కాగా, చెన్నై అవకాశాలను క్లిష్టంగా మార్చుకుంది.
చెన్నై ఓపెనర్ శామ్ కరన్ తొలి ఓవర్ మూడో బంతికే డకౌట్ అయి వెనుదిరిగినప్పటికీ డుప్లెసిస్ (47 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 58), వాట్సన్ (28 బంతుల్లో 6 ఫోర్లతో 36), రాయుడు (25 బంతుల్లో ఫోర్, 4 సిక్సర్లతో 45), రవీంద్ర జడేజా (13 బంతుల్లో 4 సిక్సర్లతో 33) రాణించడంతో తొలుత చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది.
5 బంతులు మాత్రమే ఆడిన అక్సర్ పటేల్ 3 సిక్సర్లతో 21 పరుగులు చేశాడు. అంతకుముందు ధవన్ మూడుసార్లు అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. 21, 50, 79 పరుగుల వద్ద అతడిచ్చిన క్యాచ్‌లను చెన్నై ఫీల్డర్లు నేలపాలు చేసి తగిన మూల్యం చెల్లించుకున్నారు. ధవన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. నేడు హైదరాబాద్-కోల్‌కతా, ముంబై-పంజాబ్ మధ్య మ్యాచ్‌లు జరగనున్నాయి.