'ఖిలాడీ' ఫస్ట్ లుక్

Admin 2020-10-18 17:04:13 entertainmen
రవితేజ 67వ సినిమాకు సంబంధించి టైటిల్ తో పాటు, ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఈ చిత్రానికి 'ఖిలాడి' అనే టైటిల్ ను ఖరారు చేశారు. రమేశ్ వర్మ పెన్మత్స దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందనే విషయాన్ని కాసేపట్లో ప్రకటించనున్నారు. ఈ చిత్రంలో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తుండగా... డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు.