డికాక్ 53 పరుగులతో ఇన్నింగ్స్ చక్కదిద్దాడు

Admin 2020-10-18 22:04:13 entertainmen
ఐపీఎల్ లో నేడు జరుగుతున్న రెండో మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు ఆడుతున్నాయి. రోహిత్ శర్మ (9) నిరాశపర్చగా, మరో ఓపెనర్ క్వింటన్ డికాక్ 53 పరుగులతో ఇన్నింగ్స్ చక్కదిద్దాడు.సూర్యకుమార్ యాదవ్ (0), ఇషాన్ కిషన్ (7), హార్దిక్ పాండ్య (8) విఫలం కాగా, కృనాల్ పాండ్య (34), కీరన్ పొలార్డ్ (12 బంతుల్లో 34; 1 ఫోర్, 4 సిక్సులు), కౌల్టర్ నైల్ (12 బంతుల్లో 24; 4 ఫోర్లు) ధాటిగా ఆడడంతో ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 176 పరుగులు చేసింది.