- Home
- tollywood
త్రివిక్రమ్ దర్శకత్వంలో మరో సినిమా చేసే ఛాన్స్
సమంత తాజాగా 'ద ఫ్యామిలీ మెన్ 2' వెబ్ సీరీస్ లో నటిస్తోంది. ఇది త్వరలో అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా స్ట్రీమింగ్ కానుంది. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మరో సినిమా చేసే ఛాన్స్ ఈ ముద్దుగుమ్మకు వచ్చినట్టు తెలుస్తోంది.
రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్ఆర్ఆర్' చిత్రంలో నటిస్తున్న ఎన్టీఆర్ దీని తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.