- Home
- national
బంపర్ ఆఫర్ 2,500కే 5జీ స్మార్ట్‌ఫోన్!
రూ. 2,500 నుంచి గరిష్ఠంగా రూ. 3 వేలకే ఈ ఫోన్‌ను అందించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది.ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాదాపు 30 కోట్ల మంది బేసిక్ 2జీ ఫోన్లను ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు వీరందరినీ తమవైపునకు తిప్పుకోవాలన్న లక్ష్యంతో 5జీ చవక స్మార్ట్‌ఫోన్లను అందివ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. దేశాన్ని 2జీ రహితంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఇటీవల ఆ సంస్థ అధినేత ముకేశ్ అంబానీ ప్రకటించారు. అందులో భాగంగానే 5జీ చవక ఫోన్లపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది.