- Home
- national
చైనాకు దీపావళి షాక్... వేల కోట్లు నష్టం!
వాస్తవానికి ఈ సమయంలో చైనా నుంచి వేల కోట్ల రూపాయల విలువైన వస్తు ఉత్పత్తులు ఇండియాకు ఇబ్బడిముబ్బడిగా దిగుమతి అవుతూ ఉండేవి, స్మార్ట్ టీవీలు, గృహోపకరణాలు, మొబైల్ ఫోన్ల నుంచి, పిల్లలు ఆడుకునే ఆటబొమ్మలు, ఆకర్షణీయమైన రంగులను వెదజల్లే బాణాసంచా... ఇలా ఒకటేమిటి... ఎన్నో రకాల ప్రొడక్టులు ఇండియాకు వచ్చేవి.70 వేల కోట్ల వ్యాపారం జరిగితే, అందులో రూ. 40 వేల కోట్ల వ్యాపారం చైనా నుంచే జరుగుతుందనడంలో సందేహం లేదు.
చైనాకు సుమారు రూ. 40 వేల కోట్ల నష్టం వాటిల్లనుందని సీఏఐటీ జాతీయ అధ్యక్షుడు ఆర్సీ భాటియా అంచనా వేశారు. ప్రజల్లో చైనా వస్తువులపై వ్యతిరేకత గణనీయంగా పెరగడమే ఇందుకు కారణమని, చైనా ప్రొడక్టులను కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తిని చూపడం లేదని ఆయన అన్నారు.