రఘురామరాజు కనిపించడం లేదని సోషల్ మీడియాలో పోస్టులు

Admin 2020-10-19 13:45:13 entertainmen
వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజుపై ప్రతిరోజు సోషల్ మీడియాలో ఏదో ఒకరకమైన కామెంట్లు పెడుతున్న సంగతి తెలిసిందే.ఎన్నికల తర్వాత నుంచి రఘురామ కనిపించడం లేదనేదే ఆ వార్త. దీనిపై రఘురామకృష్ణరాజు తనదైన శైలిలో స్పందించారు. ఈ పోస్టులను తమ వైసీపీ పార్టీకి చెందనవాళ్లే పెడుతున్నారని... తన నియోజకవర్గానికి వెళ్లేలా తనను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని... తన గురించి కామెంట్లు చేస్తున్న వారు ఒక పెద్ద మనిషి గురించి మాట్లాడటం లేదని అన్నారు. వ్యక్తిగత అవసరాల కోసం ఢిల్లీకి తిరుగుతూ... మిగిలిన సమయాల్లో బయటకే రాని వ్యక్తి గురించి ఎందుకు మాట్లాడటం లేదని వ్యాఖ్యానించారు.