విజయ్ దేవరకొండ 'ఫైటర్' లో సునీల్ శెట్టి

Admin 2020-10-19 13:57:13 entertainmen
విజయ్ దేవరకొండ కలల చిత్రం ఫైటర్ బాలీవుడ్ ఎంట్రీకి ఇది కచ్చితంగా మంచి బేస్ ఇస్తుందని అతడి నమ్మకం. ఈ సినిమాను స్పీడ్ సినిమాల డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు పాన్ ఇండియా అప్పీల్ ఉండడంతో దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ నిర్మిస్తున్నారు. బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ ఇందులో భాగస్వామ్యమయ్యారు. ఈ సినిమాలో విజయ్ సరసన అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుండగా.. సునీల్ శెట్టి ఇందులో నటించడానికి అంగీకరించారట.