సంజూ శాంసన్ ఈ నిర్లక్ష్యం పనికిరాదు.. : భారత మాజీ క్రికెటర్

Admin 2020-10-20 11:29:13 entertainmen
రాజస్థాన్ రాయల్స్ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మెన్ సంజూశాంసన్ ఆట తీరుపై భారత మాజీ క్రికెటర్, తెలుగు కామెంటేటర్ వేణుగోపాల్ రావు అసహనం వ్యక్తం చేశాడు.

ఎంత సేపు భారీ షాట్లు ఆడుతూ మూల్యం చెల్లించుకుంటున్నాడని, టీ20 క్రికెట్ అంటే ఎంతసేపు ఫోర్లు, సిక్స్‌లే కాదని చురకలంటించాడు. చెన్నైసూపర్ కింగ్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 7 వికెట్లతో గెలిచి ప్లే ఆశలను నిలుపుకున్న విషయం తెలిసిందే.

అయితే ఈ మ్యాచ్‌కు ముందు బైజూస్ క్రికెట్ లైవ్ షోలో మాట్లాడిన వేణు.. శాంసన్ బాధ్యతాయుతంగా ఆడాలని సూచించాడు.