ఓటీటీ రిలీజ్‌కు రెడీ అయిన "ఆకాశం నీ హద్దురా"

Admin 2020-10-24 13:18:13 entertainmen
ఓటీటీ రిలీజ్‌కు రెడీ అయిన అతి పెద్ద సినిమా అంటే.. ‘ఆకాశం నీ హద్దురా’నే. తమిళంలో ‘సూరారై పొట్రు’ పేరుతో తెరకెక్కిన ఈ చిత్రంలో సూర్య కథానాయకుడిగా నటించగా. ఈ నెల 30న అమేజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా రిలీజ్ కావాల్సింది. సినిమా తెరకెక్కింది ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో అన్న సంగతి తెలిసిందే. ఐతే ఈ మధ్యే విడుదలైన జాన్వి కపూర్ సినిమా ‘గుంజన్ సక్సేనా’లో ఎయిర్ ఫోర్స్ అధికారులను నెగెటివ్‌గా చూపించిన నేపథ్యంలో సూర్య సినిమా మీద ప్రత్యేకంగా దృష్టిసారించారు.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు ఎయిర్ ఫోర్స్ నుంచి ఎన్వోసీ వచ్చేసిందట. సినిమా విడుదలకు ఇక అడ్డంకులు తొలగిపోయినట్లే. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకుని ఫస్ట్ కాపీతో రెడీగా ఉందీత చిత్రం. మరి యథాప్రకారం అక్టోబరు 30న సినిమాను విడుదల చేస్తారా లేదా అన్నది మాత్రం తెలియడం లేదు. సూర్య ఆలోచన ఇప్పుడు వేరుగా ఉందని.. తమిళులకు అతి పెద్ద పండుగల్లో ఒకటైన దీపావళిని పురస్కరించుకుని నవంబరు రెండో వారంలో ఈ సినిమాను రిలీజ్ చేద్దామా అని యోచిస్తున్నాడని అంటున్నారు.