"రాథేశ్యామ్" జాత‌కం నేప‌థ్యంలో సాగే క‌థ

Admin 2020-10-24 13:36:13 entertainmen
రాథేశ్యామ్ చిత్రానికి జిల్ ఫేమ్ రాథాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి పిరియాడిక్ లవ్ స్టోరీ.. ఇటలీ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా ఉంటుంది అని వార్తలు వచ్చాయి. జాతకం చుట్టూ ఈ సినిమా కథ నడుస్తుందని ఫిల్మ్ నగర్‌లో టాక్ వినిపించింది. ఇలా వార్తలు వచ్చినప్పుడు కూడా... చిత్ర యూనిట్ స్పందించలేదు. దీంతో ఇది గాసిప్ ఏమో అనుకున్నారు. అయితే... ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్‌లో రాథేశ్యామ్ స్టోరీ హింట్ ఇచ్చారు. జాత‌కం నేప‌థ్యంలో సాగే క‌థ ఇద‌ని… ముందు నుంచీ ప్ర‌చారం జ‌రుగుతోంది. దాన్ని నిజం చేస్తూ.. మోష‌న్ పోస్ట‌ర్‌లో అర‌చేయి, అందులోని గీత‌ల‌తో టీజర్ స్టార్ట్ చేసారు. ప్రేమకథ అని చెప్పకనే చెప్పేసారు. ఇందులో రెబల్ స్టార్ కృష్ణంరాజు కీలక పాత్ర పోషిస్తుండడం విశేషం. ప్రస్తుతం ఇటలీలో షూటింగ్ జరుపుకుంటుంది.