రెండు వరుస విజయాలతో రష్మిక

Admin 2020-10-24 19:34:13 entertainmen
కన్నడ భామ రష్మిక ఇప్పుడు టాలీవుడ్ లో చాలా డిమాండులో వుంది. మహేశ్ తో 'సరిలేరు నీకెవ్వరు', నితిన్ తో 'భీష్మ' చిత్రాలలో నటించి వరుస విజయాలు అందుకున్న రష్మికకు ప్రేక్షకులలో క్రేజ్ పెరిగింది. అల్లు అర్జున్ సరసన 'పుష్ప' సినిమాలో రష్మిక నటిస్తోంది. అలాగే, మరికొన్ని సినిమాల విషయంలో కూడా చర్చలు నడుస్తున్నాయి. తాజాగా శర్వానంద్ సరసన కూడా నటించే అవకాశాన్ని ఈ చిన్నది పొందినట్టు సమాచారం.