అజయ్ ను ఎవరూ సంప్రదించలేదని క్లారిటీ ఇచ్చిన వైనం

Admin 2020-10-24 20:06:13 entertainmen
దర్శకుడు ఓంరౌత్ 'ఆదిపురుష్' చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. శివుడి పాత్రలో అజయ్ దేవగణ్ నటించబోతున్నాడనే ప్రచారం జరుగుతోంది. అజయ్ దేవగణ్ టీమ్ ఖండించింది. 'ఆదిపురుష్' సినిమా కోసం అజయ్ ను ఎవరూ ఇంత వరకు కలవలేదని చెప్పింది. ప్రచారానికి ఇప్పటికైనా ముగింపు పడుతుందని భావిస్తున్నట్టు తెలిపింది. మరోవైపు సీత పాత్రకు సంబంధించి కూడా పూర్తి క్లారిటీ రాలేదు. ఈ పాత్రకు అనుష్క శర్మ, అనుష్క శెట్టి, కియారా అద్వాణీ, కృతిసనన్ పేర్లు వినిపించాయి.