ర‌వీనా టాండ‌న్ పుట్టిన సంద‌ర్భంగా "కేజీఎఫ్ 2" ఫస్ట్ లుక్

Admin 2020-10-26 11:19:13 entertainmen
ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పీరియాడికల్‌ ఎంటర్‌టైనర్‌లో యశ్‌ కథానాయకుడిగా నటించారు. కన్నడలో రూ.200 కోట్ల మార్క్‌ను దాటిన తొలి సినిమాగా రికార్డు కూడా సొంతం చేసుకుంది. ఇప్పుడీ చిత్రానికి కొనసాగింపుగా ‘కేజీఎఫ్‌ ఛాప్టర్‌ 2’ తెరకెక్కిస్తున్నారు ప్రశాంత్‌. ర‌వీనా టాండ‌న్ పుట్టిన సంద‌ర్భంగా కేజీఎఫ్ 2 చిత్ర యూనిట్ సినిమాలో లుక్ విడుద‌ల చేసింది. ఇందులో ర‌వీనా ఎర్ర‌టి చీర ధ‌రించి అసెంబ్లీలో ఉన్న‌ట్టు క‌నిపిస్తున్నారు. ర‌వీనా లుక్ అభిమానులనే కాదు సినీ ప్రేక్ష‌కుల‌ని కూడా ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది.