- Home
- international
ఇస్లాం వ్యతిరేక కంటెంట్ పై బ్యాన్ విధించండి : ఇమ్రాన్ ఖాన్
ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ కు పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ లేఖ రాశారు. ఇస్లాంకు వ్యతిరేకంగా ఉన్న కంటెంట్ ని బ్యాన్ చేయాలని లేఖలో కోరారు. ఇస్లామిక్ ప్రపంచానికి వ్యతిరేకంగా ఫేస్ బుక్ లో పెద్ద ఎత్తున సమాచారం షేర్ అవుతోందని... ఇది ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర పరిణామాలకు దారి తీస్తుందని, హింసను ప్రేరేపిస్తుందని చెప్పారు. మహమ్మద్ ప్రవక్త ఫొటోలను విద్యార్థులకు చూపిస్తున్నాడనే కారణంతో ఫ్రాన్స్ లో ఒక ఉపాధ్యాయుడిని ఇస్లామిక్ అతివాదులు హత్య చేసిన నేపథ్యంలో ఆ దేశాధ్యక్షుడు ఎమాన్యుయేల్ మక్రాన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అతివాదులు మన దేశంపై కన్నేశారని... అందువల్ల ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో కూడా జరుగుతూనే ఉంటాయని అన్నారు. ఇస్లాంకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో నెటిజెన్లు పెద్ద ఎత్తున కామెంట్లు పెడుతున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడి వ్యాఖ్యలను ఇమ్రాన్ ఖండించారు.