మామకు తగ్గ కోడలినని : సమంత

Admin 2020-10-26 12:11:13 entertainmen
హౌస్ లోని కంటెస్టెంట్లలతో ఆటలాడించి, పాటలు పాడించి, డ్యాన్సులు చేయించిన సమంత, ఆపై ఎలిమినేషన్ ఎపిసోడ్ ను నిర్వహించింది. ఎలిమినేషన్ లో ఉన్న ఒక్కొక్కరినీ సేఫ్ గా ప్రకటిస్తూ వచ్చి, చివరికి నోయల్, దివిలను నిలబెట్టి, దివి ఎలిమినేట్ అని చెప్పి, వీక్షకులకు షాకిచ్చింది సమంత. వాస్తవానికి ఈ వారం ప్రతి ఒక్కరూ మోనాల్ వెళ్లిపోతుందని భావించారు. ఇక గత రాత్రి దివి ఎలిమినేట్ అని చెప్పగానే, హౌస్ కంటెస్టెంట్లలో అమ్మ రాజశేఖర్ బోరున విలపించాడు. మాస్టర్ ను ఓదార్చేందుకు చాలా సమయమే పట్టింది. ఆపై అందరికీ వీడ్కోలు పలికిన దివి, హౌస్ నుంచి బయటకు వచ్చి, స్టేజ్ మీదకు వచ్చిన తరువాత, అప్పటికే స్టేజ్ పై స్పెషల్ గెస్ట్ గా ఉన్న కార్తికేయ, ఆమెకు తన పక్కన నటించే చాన్స్ ఇస్తానని హామీ ఇచ్చాడు. ఇక నిన్నటి ఎలిమినేషన్ లో అందరూ మెచ్చే మరో ఆసక్తికర అంశం... షో చివర్లో వచ్చింది. "నీ మనసులోని మాటను బయటపెట్టాలి" అని సమంత హీరో కార్తికేయను కోరగా, "మీతో ఒక్క సినిమా చేయాలని ఉంది" అని చెప్పేశాడు. దానికి సమంత కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.