- Home
- tollywood
"సుల్తాన్" ఫస్ట్ లుక్
విభిన్న కథా చిత్రాలు చేస్తూ తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా ఒక ఇమేజ్ ను, ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. మొదటి నుంచీ తెలుగు మీద కూడ దృష్టి పెట్టడంతో ఇక్కడ కూడా అతని సినిమాలకు మార్కెట్ ఏర్పడింది. 'ఖైదీ' సినిమా కూడా అతనికి తమిళ, తెలుగు భాషల్లో మంచి పేరుతెచ్చిపెట్టింది.
కార్తీ చేస్తున్న తాజా చిత్రం పేరు 'సుల్తాన్'. తెలుగు, తమిళ భాషల్లో ఇదే టైటిల్ నిర్ణయించారు. 'రెమో' ఫేమ్ బక్కియరాజ్ కణ్ణన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో హాట్ బ్యూటీ రష్మిక కథానాయికగా నటించింది.
ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఈ రోజు విడుదల చేశారు. యాక్షన్ ఎపిసోడ్ కి సంబంధించిన ఈ లుక్ లో కార్తీ ఫుల్ సీరియస్ గా కనిపిస్తున్నాడు.