- Home
- tollywood
మా నుంచి మీకు దసరా శుభాకాంక్షలు : కాజల్ అగర్వాల్
కాజల్ అగర్వాల్ వివాహం ఈ నెల 30న వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూతో ముంబైలో జరగనుంది. దగ్గరి బంధువులతో కలిసి ఈ వివాహ వేడుక నిరాడంబరంగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో తనకు కాబోయే భర్తతో ఆమె ఓ ఫొటో దిగి పోస్టు చేసింది.
‘మా నుంచి మీకు దసరా శుభాకాంక్షలు’ అని ఆమె పేర్కొంది. ఈ ఫొటోలో వారిద్దరు చిరునవ్వులు చిందిస్తూ కనపడుతున్నారు. కాగా, ఇప్పటికే వారి ఇళ్లలో పెళ్లికి సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి.