పవన్ పక్కన కథానాయిక పాత్రకు సాయిపల్లవి

Admin 2020-10-29 21:23:13 entertainmen
'అయ్యప్పనుమ్ కోషియమ్' చిత్రాన్ని పవన్ హీరోగా తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి విదితమే. సాగర్ చంద్ర దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రంలో పవన్ పక్కన కథానాయిక పాత్రకు సాయిపల్లవి పేరును పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. ఇదిలావుంచితే, ప్రస్తుతం నాగ చైతన్యకు జోడీగా 'లవ్ స్టోరీ' చిత్రంలోనూ, 'విరాటపర్వం' చిత్రంలో రానా సరసన, 'శ్యామ్ సింగ రాయ్'లో నాని పక్కన ప్రస్తుతం సాయిపల్లవి నటిస్తోంది.