'ఎస్ఎమ్ఎస్ ఫర్ డిచ్' జర్మన్ సినిమాకి రీమేక్ : ప్రియాంక

Admin 2020-10-29 21:44:13 entertainmen
 'ఎస్ఎమ్ఎస్ ఫర్ డిచ్'కి రీమేక్ గా రూపొందే అమెరికన్ సినిమాలో ప్రియాంక హీరోయిన్ గా నటించనుంది. దీనికి 'టెక్స్ట్ ఫర్ యు' అనే పేరుని తాత్కాలికంగా నిర్ణయించారు. ఇందులో శ్యామ్ హ్యూఘన్, సెలీన్ డియోన్ లతో కలసి ఆమె నటించనుంది. 

ఈ సినిమా కథ లైన్ విషయానికి వస్తే, కథానాయిక త్వరలో పెళ్లి చేసుకోబోయే బాయ్ ఫ్రెండ్ ఓ ప్రమాదంలో మరణిస్తాడు. ఆ బాధ నుంచి కోలుకునే ప్రయత్నంలో భాగంగా, అతను ఇంకా ఉన్నట్టుగానే భావిస్తూ అతని మొబైల్ నెంబర్ కి ఎస్సెమ్మెస్ లు పంపుతుంటుంది. అయితే, ఇక్కడే చిన్న ట్విస్ట్ వుంది. అప్పటికే ఆ నెంబర్ని మరో యువకుడికి సదరు సంస్థ కేటాయిస్తుంది. ఈమె పంపే సందేశాలకి అతను స్పందిస్తుంటాడు.