- Home
- tollywood
ప్రస్తుతం మ్యూజిక్ సిటింగ్స్ లో తమన్
'అల వైకుంఠపురములో' చిత్రం పాటలు సాధించిన విజయం మనకు తెలిసిందే. ఆ చిత్రంలోని పాటలు యూ ట్యూబ్ లో సరికొత్త రికార్డులను కూడా సృష్టించాయి. దీంతో తమన్ డిమాండ్ ఇప్పుడు మరింత పెరిగింది.
మహేశ్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'సర్కారు వారి పాట' చిత్రానికి కూడా తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ప్రస్తుతం బాణీలను కడుతున్నట్టు తమన్ తాజాగా సోషల్ మీడియాలో పేర్కొన్నాడు. "తాజాగా సర్కారు వారి పాట కోసం లవ్లీ బాణీలను కట్టడానికి సిటింగ్స్ జరిగాయి. సూపర్ స్టార్ మహేశ్ గారి కోసం చక్కని పాటలను ఇవ్వడానికి తగ్గా లవ్లీ సన్నివేశాలను క్రియేట్ చేసిన డార్లింగ్ పరశురామ్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి' అంటూ తమన్ ట్వీట్ చేశాడు.