ఈ విజయం చెన్నైకి ఊరటే!

Admin 2020-10-30 15:04:13 entertainmen
ప్లే ఆఫ్స్‌కు దూరమై నామమాత్రపు మ్యాచ్‌లు ఆడుతున్న చెన్నై ఉపయోగం లేని మ్యాచుల్లో చెలరేగిపోతోంది. వరుస విజయాలు సాధిస్తూ ఇతర జట్ల ప్లే ఆఫ్స్ ఆశలపై నీళ్లు చిలకరిస్తోంది. మొన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును ఓడించిన చెన్నై.. కోల్‌కతాకు మాత్రం భారీ నష్టం జరిగే అవకాశం ఉంది. కోల్‌కతాకు మరొక్క మ్యాచ్ మాత్రమే మిగిలి ఉండగా, పంజాబ్‌కు రెండు మ్యాచ్‌లు ఉన్నాయి. ఆ రెండింటిలోనూ విజయం సాధిస్తే ఆ జట్టు నేరుగా ప్లే ఆఫ్స్‌కు వెళ్తుంది. 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 172 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం 173 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన చెన్నై చివరి బంతికి విజయాన్ని అందుకుంది. వాట్సాన్ 14 పరుగులకే అవుటైనప్పటికీ రుతురాజ్ గైక్వాడ్ మరోమారు చక్కని ఇన్నింగ్స్ ఆడాడు. 53 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 72 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.