"కలర్ ఫోటో" సినిమా చూసి ఇంప్రెస్ అయ్యా : జగ్గూభాయ్

Admin 2020-10-30 15:31:13 entertainmen
ఓటీటీ ప్లాట్ ఫామ్ ద్వారా విడుదలైన 'కలర్ ఫోటో' చిత్రం అందరి మన్ననలు పొందుతోంది. సాయిరాజేశ్ నీలం, బెన్నీ ముప్పానేని నిర్మాతలుగా సందీప్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలను సైతం పొందుతోంది. రవితేజ, విజయ్ దేవరకొండ, నాని, మారుతి వంటి వారు ఇప్పటికే ఈ చిత్రంపై ప్రశంసలు కురిపించారు. జగపతిబాబు ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ, ఈ సినిమా అద్భుతంగా ఉందని కితాబిచ్చారు.