- Home
- tollywood
పవన్ కల్యాణ్ సినిమాలో ఐశ్వర్య రాజేశ్
'కౌసల్య కృష్ణమూర్తి' చిత్రం ద్వారా తెలుగు తెరకి పరిచయమైన ఐశ్వర్య రాజేశ్ తమిళంలో పలు సినిమాలలో కథానాయికాగా నటించింది. కథానాయకుడు రాజేశ్ కి ఐశ్వర్య కూతురు కాగా, ప్రముఖ హాస్యనటి శ్రీలక్ష్మికి మేనకోడలు అవుతుంది. ఈమెకు మంచి ఆఫర్లు వస్తున్నాయి. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆర్ఆర్ఆర్' చిత్రంలో ఎన్టీఆర్ సరసన ఓ కథానాయికగా ఆమె ఇప్పటికే ఎంపికైనట్టు వార్తలొచ్చాయి. మరోపక్క, పవన్ కల్యాణ్ సినిమాలో కూడా ఆమె ఛాన్స్ కొట్టేసినట్టు తెలుస్తోంది. మలయాళంలో హిట్టయిన 'అయ్యప్పనుమ్ కోషియమ్' చిత్రాన్ని పవన్ తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి విదితమే. సాగర్ చంద్ర దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రంలో కథానాయికగా ఐశ్వర్యను ఎంపిక చేసినట్టు తాజా సమాచారం.