- Home
- tollywood
తండ్రిని మిస్ అవుతున్నా: సినీనటి రాయ్ లక్ష్మి
తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో నటించిన రాయ్ లక్ష్మి తండ్రి రామ్ రాయ్ కన్నుమూశారు. ఈ విషయాన్ని రాయ్ లక్ష్మి తన ట్విట్టర్ ఖాతాలో తెలిపింది. తన తండ్రిని కాపాడుకోలేకపోయానని, చాలా బాధగా ఉందని చెప్పింది. తన తండ్రిని మిస్ అవుతున్నానని, ఈ బాధను నేను ఎలా అధిగమించగలనని ఆమె బాధపడింది. తనను ప్రేమించినంతగా తనను ఎవరు ప్రేమించలేదని తెలిపింది. తన తండ్రి గొప్ప మనసు ఉన్న వ్యక్తి అని, ఆయన గుండె ఆగిపోయిందన్న విషయం చాలా బాధ కలిగిస్తుందని చెప్పింది. ఈ ఘటన తన జీవితాన్ని అంధకారం చేసిందని, తన తండ్రి పైనుంచి తనను ఆశీర్వదిస్తారని తెలిపింది.