హైదరాబాదులో తాజా షెడ్యూలు షూటింగ్ : గోపీచంద్

Admin 2020-11-24 15:11:33 entertainmen
ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో 'సీటీ మార్' చిత్రాన్ని చేస్తున్నాడు. తమన్నా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం తాజా షెడ్యూలు షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులో జరుగుతోంది. దీని తర్వాత గోపీచంద్ తన తదుపరి చిత్రాన్ని 'సాహో' ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో చేయనున్నట్టు తెలుస్తోంది. ప్రభాస్ తో చేసిన 'సాహో' సినిమా విజయం సాధించనప్పటికీ, యాక్షన్ దృశ్యాల చిత్రీకరణ రీత్యా దర్శకుడు సుజిత్ కి అది మంచి పేరుతెచ్చింది. ఈ చిత్రం తర్వాత ఆయన చిరంజీవితో 'లూసిఫర్' రీమేక్ చేస్తారని వార్తలు వచ్చినప్పటికీ, అది కార్యరూపం దాల్చలేదు.