వరుసగా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న రష్మిక మందన్న, లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్స్ రద్దు కావడంతో, ఇంటి పట్టునే ఉంది. అయినప్పటికీ, సామాజిక మాధ్యమాల ద్వారా ఎప్పటికప్పుడు తన అభిమానులకు తన గురించిన అప్ డేట్స్ ను ఇస్తూనే ఉంది. ఈ అందాల భామ సోమవారం నాడు హైదరాబాద్ కు చేరుకుంది. గ్రే కలర్ ఫుల్ సూట్ వేసుకుని, ముఖానికి మాస్క్ ధరించివున్నా, ఆ సమయంలో ఎయిర్ పోర్టులోని కొందరు ఆమెను గుర్తు పట్టి వీడియో తీశారు. ఆ వీడియో వైరల్ అవుతోంది.