కోహ్లీ మంచి కెప్టెన్ అయినా రోహిత్ బెస్ట్ : గౌతమ్ గంభీర్

Admin 2020-11-24 15:31:33 entertainmen
విరాట్ కోహ్లీ కెప్టెన్సీపై విమర్శలు గుప్పిస్తున్న మాజీ క్రికెటర్, ఎంపీ గౌతమ్ గంభీర్, మరోసారి నోరు విప్పారు. స్టార్ స్పోర్ట్స్ నిర్వహించే క్రికెట్ కనెక్టెడ్ కార్యక్రమంలో ఆకాశ్ చోప్రా, పార్థివ్ పటేల్ తో కలిసి మాట్లాడిన గంభీర్, కోహ్లీ మంచి కెప్టెన్ అని, అయినప్పటికీ, రోహిత్ శర్మ అత్యుత్తమ నాయకుడని ఐపీఎల్ 13వ సీజన్ లో తాను కెప్టెన్ గా ఉన్న ముంబై ఇండియన్స్ ను గెలిపించిన రోహిత్ శర్మ, ఐదోసారి విజయవంతమైన కెప్టెన్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో విరాట్ కోహ్లీ నాయకత్వం వహిస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు, ఇంతవరకూ ఒక్కసారి కూడా కప్ ను గెలుచుకోలేదు.