భార్యను పరిచయం చేయనున్న ప్రభుదేవా

Admin 2020-11-24 15:38:33 entertainmen
కొరియోగ్రాఫర్ ప్రభుదేవా రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ప్రభుదేవా సోదరుడు రాజు సుందరం కూడా నిర్ధారించారు. 1995లో రామలత అనే మహిళను వివాహం చేసుకున్న ప్రభుదేవా, 16 ఏళ్ల తర్వాత వ్యక్తిగత కారణాల వల్ల విడాకులు తీసుకున్నాడు. ముంబైకి చెందిన డాక్టర్ హిమనిని ప్రభుదేవా పెళ్లి చేసుకున్నాడు. అయితే, దీనిపై ఆయన అధికారికంగా ప్రకటన మాత్రం చేయలేదు. త‌న భార్య‌ని మీడియాకు ప‌రిచ‌యం చేయాల‌ని ఆయన నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఏడాది పాటు డేటింగ్‌లో ఉన్న ప్రభుదేవా, హిమని సెప్టెంబరు‌లోనే వివాహబంధంతో ఒక్కటయ్యారని తెలుస్తోంది.