'వకీల్ సాబ్'కి వస్తానంటున్న శ్రుతిహాసన్!

Admin 2020-11-25 21:15:31 entertainmen
శ్రుతి హాసన్ నటన నుంచి ఆమధ్య కొన్నాళ్లు గ్యాప్ తీసుకుని, మళ్లీ ఇటీవలే కథానాయికగా బిజీ అవుతోంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కొత్తగా సినిమాలు ఒప్పుకుంటోంది. పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న 'వకీల్ సాబ్'. ఈ చిత్రం షూటింగులో ఈ ముద్దుగుమ్మ ఇంతవరకు జాయిన్ కాలేదు. వచ్చే జనవరి నుంచి ఈ చిత్రం సెట్స్ లో అడుగుపెడతానని అమ్మడు చెప్పింది. ఇన్ స్టాలో అభిమానులతో ముచ్చటిస్తూ శ్రుతి ఈ విషయాన్ని చెప్పింది. పవన్ కల్యాణ్ తో మరో సినిమా చేస్తున్నందుకు హ్యాపీగా వుంది. అందులోనూ ఆయన చాలా గ్యాప్ తర్వాత చేస్తున్న వకీల్ సాబ్ లో నటిస్తుండడం ఇంకా హ్యాపీగా వుంది.