- Home
- tollywood
రామ్ చరణ్ సరసన నటించే అవకాశం : రష్మిక
రష్మిక రేంజ్ టాలీవుడ్ లో బాగా పెరిగింది. స్టార్ హీరోలు చాలామంది ఆమెనే కోరుకుంటూ ఉండడంతో పారితోషికం కూడా పెంచేసింది. ఆమెకు పలు ఆఫర్లు వస్తున్నాయి. ఈ క్రమంలో మరో స్టార్ హీరో రామ్ చరణ్ సరసన నటించే అవకాశం కూడా ఈ ముద్దుగుమ్మకు తాజాగా వచ్చినట్టు తెలుస్తోంది. హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' సినిమా రూపొందుతున్న సంగతి విదితమే. ఇందులో రామ్ చరణ్ అతిథిగా ఓ కీలక పాత్రను పోషిస్తున్నాడు. ఆయన ఇందులో విద్యార్థి నాయకుడుగా కనిపిస్తాడని అంటున్నారు. ఆయన సరసన హీరోయిన్ కూడా వుంటుందట. దాంతో తాజాగా ఆ పాత్రకు రష్మికను సంప్రదించారట. పాత్ర నచ్చడంతో ఆమె ఓకే చెప్పినట్టు తాజా సమాచారం.